సెప్టెంబర్ 3వ తేదీన కొయ్యూరు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు మంగళవారం తెలిపారు. కొయ్యూరు మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బడుగు రమేశ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండలంలోని ప్రజాప్రతినిధులు అందరూ హాజరు అవుతారని చెప్పారు. ఈమేరకు మండలంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పూర్తి సమాచారంతో సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.