గణేష్ నిమజ్జనం సందర్భంగా మక్తల్ నియోజవర్గంలోని ఆత్మకూరులో బీజేపీ నాయకులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులపై బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మనోహర్ గౌడ్, హైదరాబాదులో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిశారు. హిందూ వ్యతిరేక కార్యక్రమాలను నిరసిస్తూ నిరసన చేపట్టిన నాయకులపై కేసు పెట్టారని రాష్ట్ర అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడతామని రామచందర్ రావు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.