వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు రైతులు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం తెలిపారు.వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ గ్రామంలో నేడు సోమవారం ఫర్టిలైజర్ షాపులను జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు మోతాదుకు మించి ఎరువులు క్రిమిసంహారక మందులు వాడవద్ద ని తెలిపారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించి రైతులు పొలాలకు మందులు పిచికారి చేయాలన్నారు. రైతులు యూరియాకు బదులుగా ఇతర మసాలాల ను వినియోగించి పంటలను సరైన విధంగా పండించాలన్నారు.