విజయనగరం జిల్లా రాజాంలో బొబ్బిలి జంక్షన్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ఆదివారం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏఎంసీ ఛైర్ పర్సన్ గా గురవాన పార్వతి ప్రమాణ స్వీకారం సందర్భంగా భారీగా వాహనాలు తరలివచ్చాయి. ఆంధ్రా-ఒడిశా ప్రధాని రహదారిపై నిలిచిన వాహనాలతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ ను ఎంతగా నియంత్రించినా ఫలితం లేకుండా పోయింది. సుమారు రెండు గంటల పాటు భారీగా వాహనాలు స్తంభించినట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.