చిత్తూరు జిల్లా .పుంగనూరు పట్టణంలో అన్నమయ్య జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ పర్యటించారు .ఈ సందర్భంగా ఆయన శనివారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎప్పటికీ రైతులకి వ్యతిరేకిని అన్నారు. యూరియా కోసం రైతులు రోడ్లపై ఎక్కుతున్నారని. ఇప్పటికైనా చంద్రబాబు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రైతు వ్యతిరేకి ముద్ర తొలగించుకోవాలన్నారు. ఈవెంట్లు పెట్టుకుని సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందని ప్రచారాలు చేస్తున్నారని. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయింది అన్నారు . ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అయూబ్ భాషా. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.