ధర్పల్లిలో మంగళవారం కత్తెర పోట్లు కలకలం రేపాయి. ఎన్టీఆర్ కాలనీకి చెందిన వడ్ల దాసు అనే వ్యక్తి ఐదుగురిని కత్తెరతో పొడవడంతో తీవ్రంగా గాయపడగా మచ్చ లక్ష్మీ అనే మహిళ మృతి చెందింది. కాలనీకి చెందిన దాసు అతని భార్య శోభ వివాహేతుర సంబంధం పెట్టుకుందని అనుమానంతో దాడి కత్తెరతో దాడి చేసే ప్రయత్నం చేయగా, అడ్డొచ్చిన లక్ష్మీతో పాటు ఆమె కూతురు గౌతమి,శెట్పల్లి నాగరాజు, కిరాణా షాపు నిర్వహిస్తున్న శెట్పల్లి భోజేశ్వర్ను కత్తెరతో పొడిచాడు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో చికిత్స పొందుతూ లక్ష్మీ మృతి చెందింది, విషయం తెలుసుకున్న ధర్పల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.