చిత్తూరు జిల్లా. పుంగనూరు మండలం రాంపల్లి గ్రామ సమీపంలో నేతగుట్లపల్లి నుంచి పుంగనూరుకు వస్తున్న షేర్ ఆటో బోల్తా పడి ఆటోలో ప్రయాణిస్తున్న నేతగుట్లపల్లి గ్రామానికి చెందిన ఈరమ్మ, మహేశ్వర, ఈశ్వరమ్మ, మోదగులపల్లి గ్రామానికి చెందిన ముని వెంకటమ్మ, గంగులమ్మ గాయపడ్డారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ . కామరేషన్, పైకేసు నమోదు చేసినట్టు ఎస్సై హరిప్రసాద్, బుధవారం రాత్రి 7 గంటలకు తెలిపారు.