ఓటరు జాబితాలో మార్పులు చేర్పులపై అభ్యంతరాలు, పొరపాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని డీఆర్డి వై.సత్యన్నారాయణరావు రాజకీయ పార్టీల నేతలకు సూచించారు. జిల్లా కలెక్టరెట్లో వివిధ రాజకీయ పార్టీ నాయకులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు ఓటర్ నమోదు, ఓటర్ తొలగింపు, ఐడి కార్డు సవరణ కోసం 1354 దరఖాస్తులు రాగా 820 పరిష్కరించామన్నారు.