గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో మెయిన్ రోడ్ వద్ద ఓ పాదచారుడు నడుస్తూ కింద పడిపోయాడని మంగళవారం స్థానికులు తెలిపారు. గమనించిన చుట్టుపక్కల వారు ఆ వ్యక్తిని పైకిలేపారు. అనంతరం ఓ ఆర్ఎంపి వైద్యుడు చికిత్స అందించారన్నారు. ఫిట్స్ వల్ల పడిపోయాడని, అనంతరం కోలుకున్నాడని అన్నారు. ఆర్.ఎం.పి ఆ వ్యక్తికి చికిత్స అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.