చిత్తూరు జిల్లా. పుంగనూరు నియోజకవర్గం. చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీ. కొలింపల్లి గ్రామ సమీపంలో భూ వివాదంలో అన్నాదమ్ములు గొడవపడ్డారు. ఈ గొడవలో అన్న గంగరాజు పై తమ్ముడు వెంకటరమణ దాడి చేయడంతో గంగరాజు త్రీవంగా గాయపడ్డాడు. గంగరాజును స్థానికులు పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు వెలుగులో వచ్చింది. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణ చేయాల్సి ఉంది.