గుత్తిలోని కోట ముఖద్వారం వద్ద ఉన్న అతి పురాతన నగరేశ్వరాలయంలో నీరు ఉబికి వస్తున్నది.గత 15 రోజులుగా నీరు వస్తున్నది.దీంతో ఆలయ కమిటీ సభ్యులు మోటార్ ద్వారా నీటిని బయటికి పంపింగ్ చేస్తున్నారు.కొండ దిగువ ప్రాంతంలో దేవాలయం ఉంది.భూమిలో నుంచి ఊట ద్వారా నీరు ఉబికి వస్తున్నది.ప్రతిరోజూ మోటార్ ద్వారా నీటిని బయటికి పంపిణీ చేస్తున్నామని ఆలయ పూజారి వెంకటాద్రి శర్మ చెప్పారు.నీటిని చూసి భక్తులు ఆశ్చర్య పోతున్నారు. ఇదంతా దేవుని మహిమని భక్తులు చర్చించుకుంటున్నారు.