నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్ ప్రాంతంలో గల పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఆలయాలకు చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు అమ్మవారు లక్ష్మీమాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. భవాని మాత మాలధారణ స్వాములు, భక్తులతో పెద్దమ్మతల్లి ఆలయం కెక్కిరిసిపోయింది.