కరీంనగర్ లోని దీపిక ప్రైవేట్ ఆసుపత్రిలో యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసినదే.. అయితే మంగళవారం ఆస్పత్రికి తాళం వేసి ఉండడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ సిపి గౌష్ ఆలం మీడియా సమావేశం నిర్వహించి, నిందితుడి అరెస్టు చేశామని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో అత్యాచారం చేసినట్లు రుజువైందని తెలిపారు. అయితే ఆసుపత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తులో ఆసుపత్రి తప్పు ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలోని రోగులను డిశ్చార్జ్ చేశారు. భయంతో తాళం వేసుకొని ఉంటారని చర్చ జరుగుతుంది.