అనకాపల్కి జిల్లా మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రైవాడ జలాశయం నుంచి వరద నీటిని మంగళవారం విడుదల చేశారు. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 113.55 మీటర్లకు చేరుకోవడంతో, గరిష్ట స్థాయి 114.00 మీటర్లకు చేరువ కావడంతో అధికారులు ఒక గేటు ద్వారా సుమారు 500 క్యూసెక్యుల వరదనీటిని శారదా నదిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలోకి సుమారు 900 క్యూసెక్యుల వరద నీరు వస్తోంది. ఈ క్రమంలో జలాశయం దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.