దేవరకద్ర నియోజకవర్గంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరగడంతో, అధికారులు ఒక గేటును తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సెలవు దినం కావడంతో పాటు, శ్రావణమాసం ముగియడంతో మాంసాహార ప్రియులు చేపల దుకాణాలకు తరలివచ్చారు. సందర్శకులు ప్రాజెక్టు అందాలను ఆస్వాదిస్తూ, ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు.