రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండల వ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఈనెల 11న చేపట్టనున్న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోడం రమణపిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారుల