అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కక్కలపల్లి వద్ద బుధవారం మధ్యాహ్నం 2:30 గంట సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలుపరుస్తున్నామని ఇప్పటికే తల్లికి వందనం రైతు భరోసా శ్రీ శక్తి ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగిందని మిగిలిన హామీలు నెరవేరుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.