పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని ఎరడ్లవలస గ్రామానికి చెందిన గిరిజనుడు బడ్నాన చిన్నారావు చేపల చెరువులో పనులు కోసం వలస వెళ్లి, తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుడు దేశ సరిహద్దులో ఉన్న జమ్ము లో ఉన్నాడని సమాచారం అందింది. అక్కడికి తాము వెళ్లేందుకు బాష రాదని, డబ్బులు కూడా లేవని గిరిజనుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిదులు, దాతలు సాయం చేసే , ఆదుకోవాలని ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.