డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ చిత్రం గత రికార్డులను తిరగరాస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు వెంకటేశ్వర థియేటర్ సెంటర్ సెంటర్లో పవన్కల్యాణ్ భారీ కటౌట్ను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆవిష్కరించి మాట్లాడారు. ఒక పక్క రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నా తాను నమ్ముకున్న కళారంగాన్ని వదులుకోకుండా ప్రేక్షకులు, అభిమానులను మెప్పించే విధంగా చిత్రాలు చేయడం అభినందనీయమన్నారు. పవన్కల్యాణ్ అభిమానులనే కాకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి భారీ కలెక్షన్లు సాధించే విధంగా ఈ చిత్రం మరోసారి రికార్డు సాధించనుందని చెప్పారు.