చివ్వెంల మండల పోలీసులు నకిలీ సిమెంట్ వ్యాపారం చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. శనివారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి ఎస్సై మహేష్ వివరాలు వెల్లడించారు. నిందితుడు కావేటి రాజు, లారీ డ్రైవర్లు ఉపేంద్ర చారి, ఎస్కే బాబులతో కలిసి బ్రాండెడ్ కంపెనీ పేరు ముద్రించి సిమెంట్ బస్తాలను తయారు చేసే వెంకటరమణ నకిలీ సిమెంట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.