ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వినాయక నిమజ్జన శోభాయాత్ర అర్ధరాత్రి 12 గంటల వరకు 70 శాతం శాంతియుతంగా పూర్తయింది. ఇంకా 30 శాతం వినాయకులు ఉన్నారని, భారీ విగ్రహాల కారణంగా నిమజ్జనం ఆలస్యం అవుతుందని అధికారులు తెలిపారు. డీజేలను పూర్తిగా నిషేధించారు. మున్సిపల్, అగ్నిమాపక, విద్యుత్, పోలీస్ శాఖలు పెద్ద చెరువు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. చెరువు వద్ద గజ ఈతగాళ్లను, భారీ క్రేన్ సహాయంతో గణపతుల నిమజ్జనం జరుగుతుందని తెలిపారు.