బెల్లంపల్లి మండలం సోమగూడెం కల్వర్ చర్చ్ వెనకాల రైలు పట్టాలు దాటుతుండగా రామగిరి ఎక్స్ప్రెస్ రైలు బండి ఢీకొని ప్రమాదవశాత్తు గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు స్థానికుల సమాచార మేరకు రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుని వివరాలు కనుగొనేందుకు దర్యాప్తు ప్రారంభించారు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడి వయస్సు 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు ఉంటుందన్నారు మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని బంధువులు సమాచారం మేరకు మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరచినట్లు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు