కొయ్యూరు మండలంలోని రైతులకు ఈ-క్రాప్ నమోదు చేస్తున్నామని మండల వ్యవసాయ అధికారిణి ఐ.భాను ప్రియాంక బుధవారం మధ్యాహ్నం కొయ్యూరులో తెలిపారు. పంట సాగు చేస్తున్న ప్రతి రైతు ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ-క్రాప్ లో నమోదైన రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు వర్తిస్తాయని తెలిపారు. పంటకు నష్టం జరిగితే ఈ-క్రాప్ లో నమోదైన రైతులకు మాత్రమే పరిహారం వస్తుందన్నారు. ఈమేరకు రైతులు ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలన్నారు.