ఎమ్మిగనూరు: డాక్టర్లపై కేసులు నమోదు చేయాలి: గడ్డం నారాయణరెడ్డి..సదరం క్యాంపుల్లో వికలాంగులకు పర్సంటేజ్ విషయంలో ఒకలా, ఇప్పుడు మరొకలా ఇస్తున్న డాక్టర్లపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నందవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కేశవకు వినతిపత్రం అందజేశారు. 20 ఏళ్లుగా వస్తున్న పెన్షన్లు, పర్సంటేజ్ తగ్గిందని ఇప్పుడు తొలగించడం అన్యాయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.