70 ఏళ్ల వృద్ధురాలు బావి వద్ద టవల్, చెప్పులు వదిలి వెళ్లడంతో ఆమె బావిలో దూకిందని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. అయితే బావిలో మోటార్లు పెట్టి ఫైర్ సిబ్బంది, పోలీసులు, గ్రామస్థులు నీటిని తోడుతూ గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి పత్తి చేనులో నుండి నడుచుకుంటూ వచ్చింది ఆ వృద్ధురాలు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఖంగు తిన్నారు. ఇంతకి ఈ సంఘటన జిల్లా లో చోటు చేసుకుంది