యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి వద్ద ఎగువన కురిసిన భారీ వర్షాలకు లో లెవెల్ బ్రిడ్జి పై నుండి వరద ప్రవాహం ప్రవహిస్తుంది. బుధవారం సాయంత్రం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో ద్విచక్ర వాహనదారులు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని వెళ్లవద్దని హెచ్చరించారు. కాగా భారీ వాహనాలు నీటి ప్రవాహం గుండా వెళ్తున్నప్పటికీ ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది.