రాపిడో రైడర్స్ ఇటీవల కాలంలో పలువురు సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయినట్లు పోలీస్ శాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో మరొకరు మోసపోకుండా సైబర్ మోసగాళ్లు మోసం చేసే విధానం పై జిల్లా ఎస్పీ శ్రీ ఇ జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మధు మల్లేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కడప నగరంలోని పాత బస్ స్టాండ్ వద్ద రాపిడో రైడర్స్ కు అవగాహన కల్పించారు. అనంతరం సంబంధిత పోస్టర్లను రద్దీ ప్రదేశాల్లో గోడలకు అతికించారు