ఈరోజు అనగా 24 వ తారీకు 8వ నెల 2025న మధ్యాహ్నం మూడున్నర గంటల సమయం నందు సారపాక సిపిఐ కార్యాలయంలో జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభ అలవాల సీతారాం రెడ్డి అధ్యక్షున నిర్వహించడం జరిగింది సిపిఐ సీనియర్ నాయకులు మాజీ జాతీయ కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అన్నారు సూరవరం మృతికి సంతాపంగా బూర్గంపాడు మండలంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు