శ్రీశైలం క్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం శెలవు దినం కావడంతో,స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఇదే సమయంలో శ్రీశైలం జలాశయం 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నాడంతో ఆ అపురూప దృశ్యాలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలం తరలి వస్తున్నారు. స్వామిని దర్శించుకున్నంతరం శ్రీశైల జలాశయాన్ని సందర్శిస్తున్నారు. దీంతో శ్రీశైలం క్షేత్రమంతా భక్తజన సందడి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున స్వామి అమ్మవార్ల దర్శనార్థం తరలివస్తున్నారు భక్తజన సందడితో శ్రీశైల క్షేత్రం అంతా భక్తులతో కిటకిటలాడుతుంది