పశువ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో జాతీయ పశు వ్యాధి నివారణ పథకం పోస్టర్లను సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు. గ్రామాల్లో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, పశువులకు మందులు, వ్యాక్సిన్లను అందించాలన్నారు. రైతులకు పశువ్యాధులు, నివారణపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పశు వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు