కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి డబుల్ బెడ్ రూమ్ కమ్యూనిటీలో శనివారం రోజు వన మహోత్సవము కార్యక్రమము నిర్వహించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 200కు పైగా మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా RDMA షాహిద్ మసూద్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. నేటి మొక్కలు భవిష్యత్తు తరాలకు నీడతోపాటు ఆక్సిజన్ కూడా అందిస్తాయని తెలిపారు. అందుకే ఈ వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలను నాటి, వాతావరణ సమతుల్యాన్ని కాపాడుతూ భావితరాలకు సహజ సిద్ధమైన వాయువును అందించేందుకు ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటుతామని తెలిపారు.