అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలో గల రావికమతం అంబేద్కర్ కాలనీ, తహశీల్దార్ కార్యాలయం వద్ద గల చెత్త డంపింగ్ యార్డ్ వలన ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.గోవిందరావు అన్నారు. ఆదివారం ఈ డంపింగ్ యార్డ్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గ్రామాలకు దూరంగా ఉండాల్సిన డంపింగ్ యార్డ్ను గ్రామానికి మధ్యలో ఏర్పాటు చేయడం అన్యాయమన్నారు. వారం రోజుల్లో తొలగించకపోతే ఆందోళన మరింత ఉద్రిక్తం చేస్తామన్నారు.