భూ భారతి చట్టం అమలులో భాగంగా నిర్వహించిన రెవిన్యూ సదస్సు లో వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించడం ద్వారా రెవెన్యూ సేవలు ప్రజల చెంతకు వెళ్లేలా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఆర్డీఓ లతో, తహసీల్దార్లతో భూ భారతి, ప్రజవాణి ఆర్జీలు, ఇందిరమ్మ ఇండ్లకి ఇసుక సరఫరా, మీసేవ సర్టిఫికెట్లు పెండింగ్ పై సమావేశం నిర్వహించారు.