మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నెల 30వ తేదీ వరకు తెలియజేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు జరిపిన మీదట సెప్టెంబర్ 2 వ తేదీన వార్డు, గ్రామ పంచాయతీల వారీగా ఫోటోతో కూడిన తుది ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు.