Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 24, 2025
రాజవొమ్మంగి మండలంలో ట్రాఫిక్ నియమాల అమలు కఠినతరం అవుతోంది. శనివారం సాయంత్రం రాజవొమ్మంగి ప్రధాన కేంద్రం వద్ద పోలీసులు విస్తృతంగా వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు.రహదారులపై ప్రయాణిస్తున్న రెండు చక్రాల వాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు ఒక్కొక్కటిగా ఆపి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్, కాలుష్య ధృవపత్రాలు ఉన్నాయా లేదా అనే విషయాలు పరిశీలించారు. ముఖ్యంగా హెల్మెట్ వాడకంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. తనిఖీల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులను పోలీసులు ఆపి వివరాలు సేకరించారు. పత్రాలు లేని పదిమందికి జరిమానా విధించారు.