‘OG' సినిమా చూడటానికి వెళ్తూ యువకుడి మృతి..పవన్ కళ్యాణ్ ‘OG' సినిమా చూడటానికి వెళ్తూ ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. దేవనకొండ మండలం మాచాపురం గ్రామానికి చెందిన మోహన్, రాముడు మూవీ చూడటానికి ఉదయం కోడుమూరుకు బయలుదేరారు. గోనెగండ్ల పరిధిలోని లింగందిన్నె వద్ద వారి బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. మోహన్ అక్కడికక్కడే మృతి చెందగా రాముడు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.