భారతీయ సంస్కృతి గురువులకు విశిష్ట స్థానం కల్పించిందని, గురువులను గౌరవించడం ఉత్తమ సంస్కారానికి నిదర్శనం అని రాజ్యసభ మాజీ సభ్యులు ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసి రెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లి లో కాంగ్రెస్ నాయకులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెండ్లిమర్రి మండలం ,గుర్రాల చింతలపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ సైన్స్ ఉపాధ్యాయులు వైవి మునీశ్వర్ రెడ్డిని , వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు చప్పిడి శిరీషను, సన్మానించారు