ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ నిర్ణయాన్ని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఆదిలాబాద్ డిసిసిబి చైర్మన్ అడ్డీ భోజా రెడ్డి అన్నారు. రుణమాఫీ రాష్ట్ర క్యాబినెట్ ప్రకటనను హర్షిస్తూ సోమవారం తాంసి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని డిసిసిబి చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.