ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు నుండి స్వీకరించిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో 71 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ఇచ్చిన ప్రతి దరఖాస్తును నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత శాఖాధికారులు జాగ్రత్తగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిష్కారంలో జాప్యం చేయొ