పెండింగ్లో ఉన్న ఎం.పి.ఎఫ్.సి గోదాము నిర్మాణ పనుల పై నివేదికలు సిద్ధం చేయండి జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఐటిడిఎ పాడేరు, రంపచోడవరం, చింతూరు ప్రాజెక్ట్ అధికారులు, డిసిఓ, మార్కెటింగ్ డిఈ, ఏఈలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముందుగా నేటి వరకు చేపట్టిన పనులపై ఆరాతీశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంజూరు కాబడిన 42 ఎం.పి.ఎఫ్.సి గోదామలకు గాను ప్రస్తుత పరిస్థితిపై ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారులు పరిశీలించి నివేదికలు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.