పబ్లిక్ యాప్ న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు. అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా పొలాల వద్ద నిలువ ఉంచిన ఇసుకడంపులను సీజ్ , దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. సోమవారం దోమ ఎస్ఐ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఉధన్ రావు పల్లి గ్రామ శివారులో 9 మంది వాగులో ఉన్న ఇసుకను అక్రమంగా ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా తమ పొలాల వద్ద ఇసుక డంపులను నిల్వ చేయడం జరిగిందని అట్టి విషయంపై దోమ పోలీసుల 10 ఇసుక డంపులను పట్టుకొని రెవెన్యూ వారికి తెలియజేయగా రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించి అట్టి 10 డంపుల ఇసుకను సీజ్ చేసినట్లు తెలిపారు.