చెన్నూరు పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం వర్షాన్ని కూడా లెక్కచేయకుండా భక్తులు ఉత్సాహంగా గణనాథుడి విగ్రహాలను మండపాల వద్దకు తీసుకువెళ్ళారు. గణపతి బప్పా నామస్వరనతో భక్తులు, విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరారు. నవరాత్రులు భక్తిశ్రద్ధలతో బొజ్జ గణపయ్యకు పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన మండపాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.