బాపట్ల జిల్లా కర్లపాలెం పట్టణంలో శనివారం పట్టపగలే ఒక దుకాణంలో దొంగతనం జరిగింది. దుకాణం యజమాని లోపలికి వెళ్లి వచ్చేలోపు, దొంగ లాకర్లోని సుమారు 35 వేల రూపాయల నగదును అపహరించుకుపోయాడు. డబ్బు కనిపించకపోవడంతో యజమాని సీసీ కెమెరాలను పరిశీలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.