Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 13, 2025
దగదర్తి మండలం వెలుపోడు గ్రామంలో వర్షం కురవడంతో వరి పంట నేలకొరిగింది. వారం రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో అకస్మాత్తుగా వర్షం రావడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందారు. దాదాపుగా మూడు ఎకరాల్లో వరి పూర్తిగా పడిపోయిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వారు కోరారు.