కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం పర్యటించారు. వీరికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్,ఎస్పీ బిందు మాధవ్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే చినరాజప్ప, పూల గుచ్చాలిచ్చే ఘన స్వాగితం పలికారు. పెద్దాపురం చేరుకున్న ఆయన వైద్య సిబ్బంది కూటమి నాయకులతో కలిపి స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర స్వచ్ఛత ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర సభ వేదికపై ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.