ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి కాలోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ మాండలికంలో సామాజిక రచనలు చేస్తూ తెలంగాణ ప్రజలను సామాజికంగా మేల్కొల్పిన గొప్ప ప్రజాకవి కాళోజి నారాయణరావు అని ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో గౌరవించిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాషా