తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ.... రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తీసుకున్న చారిత్రక నిర్ణయమని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు.......