ఓ ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులకు ఓ వ్యక్తి ఆత్మహత్య కు యత్నించాడు. ఆదివారం బాధితుడి కుమారుడు తెలిపిన వివరాలు ప్రకారం ఆసిఫాబాద్ మండలం జెండాగూడ గ్రామానికి చెందిన అశోక్ 2008లో లారీ కొన్నాడు. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో రుణం తీసుకున్నాడు. 4 ఏళ్లు కిస్తీలు కట్టాడు. తర్వాత కట్టకపోవడంతో 2013లో లారీను వాళ్లు తీసుకెళ్లారు. 12 ఏళ్ల తర్వాత ఫైనాన్స్ వాళ్లు మళ్లీ వచ్చి మీరు రూ.6.74 లక్షలు కట్టాలని బెదిరించడంతో అశోక్ పురుగు మందు తాగాడు.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు..