జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ కుమార్ కోరారు. శనివారం సాయంత్రం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... కళాశాల ప్రహరీ గోడ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కళాశాల కిటికీల అద్దాలు, కరెంటు స్విచ్లు ధ్వంసం అయ్యాయా అని తెలిపారు. కళాశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.