కరీంనగర్లో గణేష్ విగ్రహం కరెంటు తీగలకు తగిలి 9మంది మరణించారనే వార్త పూర్తిగా అవాస్తవం అని గురువారం మధ్యాహ్నం 12గంటలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు వాస్తవాలు తెలుసుకోకుండా ఈ అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లాలో అటువంటి విద్యుత్ ప్రమాదం ఏదీ జరగలేదని స్పష్టం చేశారు. నాలుగు నెలల క్రితం కోరుట్లలో గణేష్ విగ్రహాల తయారీ సందర్భంగా జరిగిన ప్రమాదాన్ని కొంతమంది ఇప్పుడు ఫార్వర్డ్ చేయడం వలన అది కరీంనగర్లో జరిగినట్టుగా తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.